విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

విజయవంతం చేయాలి

Mar 10 2026 1:26 PM | Updated on Mar 10 2026 1:26 PM

‘ప్రగతి ప్రణాళిక’ను

కడ్తాల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, తడి, పోడి చెత్త నిర్వహణ, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీల నిర్వహణ, పైపులైన్‌ లీకేజీల మరమ్మతులు, నీటి ట్యాంకులను శుభ్ర పరచడం, ఉపాధి హామీ కింద మంజూరైన పనులు సకాలంలో పూర్తి చేయడం తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, ఎంపీడీఓ సుజాత, ఎంఈఓ నిర్మల, ఎంపీఓ లాలయ్య, సర్పంచ్‌ భిక్షపతి, ఉప సర్పంచ్‌ యాదగిరెడ్డి, నాయకులు రాఘవేందర్‌, జహంగీర్‌బాబా, గణేశ్‌గౌడ్‌, చందోజీ నాగరాజు, మహేశ్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement