ఆమనగల్లు: తలకొండపల్లి మండలం దేవునిపడకల్‌లోని వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం స్వామి వారి కల్యాణోత్సవం కనులపండువగా నిర్వహించారు. మేళతాళాల నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలను వేదిక మీదకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, గోపాలాచార్యులు కల్యాణక్రతువు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత మల్లేశ్, ఉపసర్పంచ్ వెంకటేశ్, మాజీ సర్పంచ్ శ్రీశైలం, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, దేవాదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, నాయకులు రామస్వామి, శ్రీరాములు, కృష్ణయ్య, లక్ష్మయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


