పహాడీషరీఫ్: బాలిక అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మణ్ తెలిపిన ప్రకారం.. యూపీకి చెందిన సుభాహ్ రాజ్‌బార్ తన కుటుంబంతో కలిసి బతుకుదెరువు నిమిత్తం జల్‌పల్లి శ్రీరామ కాలనీకి వలస వచ్చాడు. ఈ నెల 9వ తేదీన దంపతులు పనికి వెళ్లగా ఇంట్లో కుమార్తె రాధ(15), కుమారుడు ఉన్నాడు. ఉదయం 10 గంటల సమయంలో కిరాణ దుకాణానికి వెళుతానని బయటికి వెళ్లిన రాధ తిరిగి రాలేదు. లాలీరామ్ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ రాజ్‌బార్ గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.
రేషన్ డీలర్‌పై తాత్కాలిక సస్పెన్షన్
ఉత్తర్వులు జారీచేసిన ఆర్డీఓ పార్థసింహారెడ్డి
శంకర్‌పల్లి: మండల పరిధిలోని మహాలింగాపురంలో రేషన్ షాప్ నం.06 డీలర్ మాచన్నగారి లక్ష్మారెడ్డి ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో న్యాయ విచారణ నిమిత్తం 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కి వెళ్లాడు. ఆయన అందుబాటులో లేకపోవడంతో డీలర్‌షిప్‌ని చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో షాప్ నం.07 డీలర్ ఎండీ ఆయూబ్ జహాన్‌కు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు శంకర్‌పల్లి తహసీల్దార్ సురేందర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు గమనించి, షాప్ నం. 07నుంచి రేషన్ సరుకులు తీసుకోవాలన్నారు.


