విఠ్యాల హెచ్‌ఎం సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

విఠ్యాల హెచ్‌ఎం సస్పెన్షన్‌

Mar 12 2026 9:09 AM | Updated on Mar 12 2026 9:09 AM

మరో ఉపాధ్యాయుడిపై బదిలీ వేటు

వెంటనే చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించిన పాఠశాల

విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌నికోలస్‌

షాద్‌నగర్‌రూరల్‌: ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని విఠ్యాల జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం రవి విధులకు హాజరుకాకపోవడంతో గ్రామస్తులు, విద్యార్థులు మంగళవారం పాఠశాలకు తాళం వేశారు. ఈ విషయమై ‘తాళం వేయబడి’అనే శీర్షికన ‘సాక్షి’దినపత్రికలో బుధవారం కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన విద్యాశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌నికోలస్‌.. డీఈఓ సుశీందర్‌రావు, మండల విద్యాధికారి మనోహర్‌తో కలిసి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం బాగుంటుందా? చదువు ఎలా చెబుతున్నారు? ఉపాధ్యాయులు సక్రమంగా వస్తున్నారా లేదా అని విద్యార్థులను, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం బాగుంది.. హెచ్‌ఎం రవి కొంత కాలంగా పాఠశాలకు రావపోవడంతో మాకు ఇంగ్లిష్‌ బోధించే ఉపాధ్యాయుడు లేడు. దీంతో పాఠాలు అర్ధం కావడం లేదని, మరో ఉపాధ్యాయుడు మల్లేశ్‌ విద్యార్థినులు, స్వీపర్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ఆయన హెచ్‌ఎం రవిని సస్పెండ్‌ చేయాలని, ఉపాధ్యాయుడు మల్లేశ్‌ను మరోపాఠశాలకు బదిలీ చేయాలని డీఈఓ సుశీందర్‌రావును అదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement