ఆమనగల్లు: తలకొండపల్లి మండలం దేవునిపడకల్‌లో వాలీబాల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం రాత్రి ముగిసింది. విజేతలకు వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నరేశ్ ప్రజాపతి, సర్పంచ్ కానుగుల అనిత మల్లేశ్ బహుమతులు అందించారు. పురుషుల విభాగంలో మొదటి బహుమతి పడకల్, రెండో బహుమతి శేఖర్ టీమ్, మూడో బహుమతి పెద్దూరు టీమ్, మహిళా విభాగంలో మొదటి బహుమతి రంగారెడ్డి జిల్లా, రెండో బహుమతి హైదరాబాద్ టీమ్, మూడో బహుమతి ఏకే స్పోర్ట్స్ అకాడమీ గెలుచుకున్నాయి. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, ఉపసర్పంచ్ అంబటి వెంకటేశ్, బీసీ సంఘం మండల అధ్యక్షుడు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.


