ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యం

Mar 10 2026 1:26 PM | Updated on Mar 10 2026 1:26 PM

కొత్తూరు: ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ రవీందర్‌నాయక్‌ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన మెగా హెల్త్‌క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రిపోర్టుల మేరకు అవసరం ఉన్న వారిని కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రికి రెఫర్‌ చేయడంతో పాటు మిగిలిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి, పీహెచ్‌సీ వైద్యురాలు దీప్తి, మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజీ, సీడీతండా సర్పంచ్‌ గభ్రునాయక్‌, పెంజర్ల సర్పంచ్‌ జగన్‌, ఎంపీడీవో అరుంధతి, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ రవీందర్‌నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement