షాద్‌నగర్: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 9న జాతీయ అప్రెంటీస్‌షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ లక్ష్మణ్ ఒక ప్రటకనలో పేర్కొన్నారు. ఈ మేళా ద్వార ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో అప్రెంటీస్‌షిప్ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించే మేళాకు ఆసక్తి కలిగిన ఐటీఐ పాసైన విద్యార్థులు తమ బయోడేటా, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని చెప్పారు. ఆన్‌లైన్ అప్రెంటీస్‌షిప్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ నంబర్‌ను విధిగా తేవాలన్నారు. బీఎల్‌ఈ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, రాడంట్ అప్లయెన్సెస్, ప్రగతి ఆర్‌ఆర్‌డీ ప్రైవేట్ లిమిటెడ్, ఆక్రమ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, షనైడర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఒలెక్ట్రా మోటార్స్, అపెక్స్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ వారు హాజరువుతున్నట్లు తెలిపారు. వివరాలకు 80748 16395, 80192 63018 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కమ్మదనం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఇన్‌స్పైర్ మనక్ అవార్డు 2025–26కు ఎంపికయ్యారు. గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శాలిని, సహస్ర తమ వినూత్న ఆవిష్కరణలు, ఆలోచనలతో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద ప్రతి విద్యార్థికి ప్రాజెక్టు అభివృద్ధికోసం ప్రభుత్వం రూ. 10వేలు మంజూరు చేస్తుంది. అవార్డుకు ఎంపికై న విద్యార్థినులలు, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయురాలిని శుక్రవారం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శారద, ఉపాధ్యాయులు అభినందించారు.
పరామర్శ
మొయినాబాద్: గౌడకుల హక్కుల పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు బస్వపురం అంజయ్యగౌడ్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. ఇటీవల అంజయ్యగౌడ్ తండ్రి కిష్టయ్యగౌడ్ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం అంజయ్యగౌడ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట గౌడకుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రేనట్ల మల్లేశ్‌గౌడ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కౌకుంట్ల మల్లేశ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
శాలిని సహస్ర


