జిల్లా రెవెన్యూ అధికారి సంగీత
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత అన్నారు. జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం కార్యాలయంలో అంతర్జాతీ మహిళా దినోత్సవాన్ని, జాతీయ డౌన్ సిండ్రోమ్ డేను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా అధికారులను సన్మానించారు. మహిళా సంక్షేమంతో పాటు అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి రమేశ్, సంస్మిత, మల్లికశ్రీ, జయశ్రీ, సజితా, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు
ఎస్‌హెచ్‌ఓగా వెంకటేశ్వర్లు
ఆమనగల్లు: స్థానిక పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా వెంకటేశ్వర్లు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఆమనగల్లు ఎస్‌ఐగా పనిచేసిన వెంకటేశ్‌ను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. ప్రస్తుతం షాద్‌నగర్ పోలీసు స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లును ఆమనగల్లు ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేయగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.


