సైనిక్‌ ఫలితాల్లో రేయాన్‌ ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

సైనిక్‌ ఫలితాల్లో రేయాన్‌ ప్రభంజనం

Mar 1 2026 8:37 AM | Updated on Mar 1 2026 8:37 AM

సైనిక్‌ ఫలితాల్లో రేయాన్‌ ప్రభంజనం

సైనిక్‌ ఫలితాల్లో రేయాన్‌ ప్రభంజనం

నాగోలు: ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఫలితాల్లో రేయాన్‌ సైనిక్‌ స్కూల్‌ విద్యార్ధులు ప్రభంజనం సృష్టించారు. తెలంగాణలో నెంబర్‌–1 ర్యాంక్‌తో పాటు 3వ ర్యాంక్‌ సాధించినట్లు కోచింగ్‌ సెంటర్‌ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి తెలిపారు. శనివారం నాగోలు రేయాన్‌ కోచింగ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా రేయాన్‌ సైనిక్‌ స్కూల్‌ కోచింగ్‌ సెంటర్‌ లో 9, 6వ తరగతి పరీక్ష ఫలితాల్లో దేవాన్ష్‌ ఆరవ్‌, 3వ ర్యాంకుతో పాటు మ్యాథ్స్‌లో 150/150, ఐటీలో 50/50 సాధించారు. 9 మంది విద్యార్థులు మ్యాథ్స్‌ లో 150/150, ఐటీలో 50/50 మార్కులు సాధించారన్నారు. మార్కులు సాధించిన వారిలో బాల వర్షిత్‌ రెడ్డి, రంజిత్‌ సాయి, జ్ఞాన వీర్‌ రెడ్డి, కంసికర్‌, సాయి సజన్‌, సాయి చరణ్‌ రెడ్డి, దీక్షిత్‌ , సోహన్‌ రెడ్డి, కే. దేవాన్ష్‌ ఉన్నారు. 63 మంది విద్యార్థుళు 250కి పైగా మార్కులు సాధించారన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందించారు. వేలాదిమంది పిల్లలను ఉన్నత శిఖరాలను చేరేందుకు రేయాన్‌ సైనిక్‌ నవోదయ సంస్థ కృషి చేస్తుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన మెరిట్‌ విద్యార్థులకు ఫీజుల్లో రాయితీ కల్పిస్తున్నామని ఆ సంస్థ డైరెక్టర్‌ ఉమా రెడ్డి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement