శంకర్‌పల్లి: మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికై న పాలకవర్గం పట్టణాభివృద్ధికి కృషి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన తొలి సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త సభ్యులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. తొలి సమావేశంలో రూ. 46 లక్షల పనులకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీకి చెందిన దుకాణాలకు అద్దె పెంపుపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శంకర్‌పల్లి పట్టణం హైదరాబాద్ మహానగరానికి చేరువలో ఉన్నందున ప్రభుత్వ పెద్దలు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, రాబోయే రోజుల్లో పట్టణం మరింత వృద్ధి సాధిస్తుందన్నారు. పాలకవర్గ సభ్యులు పలు పార్టీలకు చెందిన వారైనప్పటికీ సమష్టిగా పని చేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 5కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యోగేశ్, వైస్‌చైర్‌పర్సన్ శ్వేత, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య


