కేశంపేట: మండల పరిధిలోని పీఎం శ్రీ కొత్తపేట జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జిల్లా వ్యాప్తంగా 41 పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడాపోటీలు మంగళవారంతో ముగిసాయి. ఖోఖో బాలికల విభాగంలో జిల్లా ప్రథమ స్థానం, వంద మీటర్ల పరుగుపందెంలో సుప్రియ ప్రథమ, వైష్ణవి తృతీయ స్థానంలో నిలిచారు. షార్ట్‌పుట్ బాలికల విభాగంలో అక్షిత ద్వితీయ బహుమతిని గెలుపొందారు. ఈ మేరకు బుధవారం ఎంఈఓ చంద్రశేఖర్ విద్యార్థులను కోచ్ నరేశ్, పీఈటీ గౌరిని అభినందించారు.


