నిరుపేదల సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

నిరుపేదల సంక్షేమమే ధ్యేయం

Nov 10 2026 8:27 AM | Updated on Nov 10 2026 8:27 AM

షాద్‌నగర్‌/కొత్తూరు: రాష్ట్ర అభివృద్ధి, నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు తండా, షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని 14 వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాటి ఇందిరా గాంధీ నుంచి నేటి వరకు నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న పార్టీ కాంగ్రెస్‌ అని పేర్కొన్నారు. అర్హులైన నిరుపేదలను గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు. రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ, పంటలకు బోనస్‌, యువకులకు ఉద్యోగాల వంటి ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకు పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 80 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి పారదర్శకమైన పాలన అందిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్‌ కట్‌ చేసి, టపాకాయలు కాల్చారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, బస్వం, విశ్వం, బాబర్‌ఖాన్‌, రఘు నాయక్‌, అందె మోహన్‌, చెంది తిరుపతిరెడ్డి, చల్లా శ్రీకాంత్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, శ్రీధర్‌, ముబారక్‌, దిలీప్‌కుమార్‌, జమృఖాన్‌, ఖదీర్‌ ముబారక్‌, సుదర్శన్‌గౌడ్‌, వీరమోని దేవేందర్‌ముదిరాజ్‌, సురేందర్‌, ఎల్లారం శేఖర్‌రెడ్డి, అంబటి ప్రభాకర్‌, శ్రీను, వేణుగోపాల్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement