ఆమనగల్లు: నిరుపేదల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపిందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని చంద్రాయణపల్లి తండా, ఆమనగల్లు, తలకొండపల్లి మండలం కర్కస్‌తండాలో ఆదివారం ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ కార్యక్రమంలో భాగంగా సంబరాలు నిర్వహించారు. లబ్ధిదారులను సత్కరించి వారితో కలిసి బాణసంచా కాల్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరిగిందన్నారు. సొంత ఇంట్లో లబ్ధిదారులతో కలిసి పండుగ జరు పుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో మున్సి పల్ చైర్మన్ పత్యానాయక్, కమిషనర్ రాఘవేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


