సామాజిక సంస్కరణలపై దృష్టి పెట్టాలి  | Positive changes in society, not on vote bank politics says PM to BJP workers | Sakshi
Sakshi News home page

సామాజిక సంస్కరణలపై దృష్టి పెట్టాలి 

Sep 26 2026 6:17 AM | Updated on Sep 26 2026 6:17 AM

Positive changes in society, not on vote bank politics says PM to BJP workers

బీజేపీ కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

న్యూఢిల్లీ: ఓటు బ్యాంకు రాజకీయాలకు బదులుగా సామాజిక సంస్కరణలు, సమాజంలో సానుకూల మార్పులపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి గుజరాత్‌లోని వాద్‌నగర్‌ వరకు సాగుతున్న ‘సేవా యాత్ర’మోటార్‌ సైకిల్‌ ర్యాలీలో పాల్గొంటున్నవారితో మోదీ శుక్రవారం వర్చువల్‌గా సంభాషించారు. గత 12 ఏళ్లలో దేశం సాధించిన అభివృద్ధిని ప్రస్తావించారు. దేశంలో నగరాలు, గ్రామాల మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని, అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఎంతో మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.

 మహిళల్లో స్వయం సమృద్ధి కూడా పెరిగిందని అన్నారు. మహాత్మా గాంధీ జీవితాన్ని మనం పరిశీలిస్తే.. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడటం, స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించడమే కాకుండా ఆయన ఒక గొప్ప సాంఘిక సంస్కర్త అని తెలుస్తుందని చెప్పారు. సమాజంలో ప్రబలంగా ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా గాంధీజీ పోరాటం చేశారని తెలిపారు. అందువల్ల, రాజకీయ కార్యకర్తలమైన మనం కూడా ఓటు బ్యాంకులను చూడకుండా, సామాజిక సంస్కరణలు, సానుకూల మార్పు కోసం కృషి చేస్తూనే ఉండాలని సూచించారు. ‘‘సమాజానికి సేవ చేసేవారు తగిన గౌరవం పొందడానికి అర్హులు’’అని ఉద్ఘాటించారు.  

పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగి..  
ప్రయాగ్‌రాజ్‌లో పారిశుధ్య పనులు చేపట్టిన కార్మికులను ప్రధానమంత్రి ప్రశంసించారు. వారి కృషి ‘కుంభమేళా’కు పారిశుధ్యం విషయంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచి్చపెట్టిందని, భారతదేశ గౌరవాన్ని పెంచిందని పేర్కొన్నారు. దేశ గౌరవాన్ని ఎంతో పెంచిన వారి పాదాలను కడిగి, వారి ఆశీస్సులు పొందాలని తనకు అనిపించిందని వ్యాఖ్యానించారు. తన సొంత జీవితంలో ‘సేవా యాత్ర’ఎంతో కీలక పాత్ర పోషించిందని, దేశంలో తాను సందర్శించని జిల్లా దాదాపుగా ఏదీ లేదని వెల్లడించారు. ఎన్నో జిల్లాల్లో రాత్రివేళ బస చేశానని, ప్రతి ప్రయాణం, ఆ క్రమంలో లభించిన ప్రతి అనుభవం నేటికీ గురువులా మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని ఉద్ఘాటించారు. ఈ ప్రయాణాలు తనకు ఎంతో నేర్పించాయని మోదీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement