న్యూఢిల్లీ: భక్తి గీతాలు ఆలపించడానికి, నృత్యం చేయడానికి ‘భజన్ క్లబ్బింగ్’అనే కొత్త ట్రెండ్ మొదలైంది. యువత ఇలాంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఆధ్యాత్మిక భావనన అలవర్చుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం భజన్ క్లబ్సింగ్‌లో భాగస్వాములయ్యారు.
శుక్రవారం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఒక పార్కులో సంఘ్ పరివార్ సిద్ధాంతకర్త దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ 110వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ముందు వరుసలో కూర్చున్నారు. శ్రీరామునిపై పాడిన భజన పాటలకు చప్పట్లు కొడుతూ, తంబూరీన్ వాయిస్తూ కనిపించారు.
ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జెన్ జెడ్ తరానికి చెందినవారు చాలామంది ఉన్నారు. వీరంతా ఆధ్యాత్మిక గీతాలను ఆలపించారు. నృత్యాలు చేశారు. మద్యం, మత్తు పదార్థాలు లేకుండా క్లబ్ లాంటి వాతావరణంలో సంగీత కచేరీ నిర్వహించబడే భజన్ క్లబ్బింగ్. ఇది ఇప్పుడిప్పుడే దేశ విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది.


