breaking news
Deendayal Upadhyayas centenary celebrations
-
భజన్ క్లబ్బింగ్లో మోదీ
న్యూఢిల్లీ: భక్తి గీతాలు ఆలపించడానికి, నృత్యం చేయడానికి ‘భజన్ క్లబ్బింగ్’అనే కొత్త ట్రెండ్ మొదలైంది. యువత ఇలాంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఆధ్యాత్మిక భావనన అలవర్చుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం భజన్ క్లబ్సింగ్లో భాగస్వాములయ్యారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఒక పార్కులో సంఘ్ పరివార్ సిద్ధాంతకర్త దీన్దయాల్ ఉపాధ్యాయ్ 110వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ముందు వరుసలో కూర్చున్నారు. శ్రీరామునిపై పాడిన భజన పాటలకు చప్పట్లు కొడుతూ, తంబూరీన్ వాయిస్తూ కనిపించారు. ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జెన్ జెడ్ తరానికి చెందినవారు చాలామంది ఉన్నారు. వీరంతా ఆధ్యాత్మిక గీతాలను ఆలపించారు. నృత్యాలు చేశారు. మద్యం, మత్తు పదార్థాలు లేకుండా క్లబ్ లాంటి వాతావరణంలో సంగీత కచేరీ నిర్వహించబడే భజన్ క్లబ్బింగ్. ఇది ఇప్పుడిప్పుడే దేశ విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది. -
పేదల సంక్షేమమే బీజేపీ మూల సిద్ధాంతం: మోదీ
కొజికోడ్: 'ఒకరు ఉన్నతంగా ఉండి, మరొకరు కుంగిపోయి ఉంటే.. పైనున్నవాళ్లు తమను తాము తగ్గించుకుని కిందున్నవాళ్ల చెయ్యి పట్టుకుని నడిపించాలి. సమాజంలో అసమానతలు పోవాలంటే అనుసరించాల్సిన విధానమిదే అని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉద్భోధించారు. భారత్ లో ముస్లింలు మిగతావారితో సమానంగా జీవించాలని ఆయన కోరుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు బీజేపీ కార్యకర్తలంతా పునరంకితం కావాలి' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దన్ దయాళ్ శత జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం కొజికోడ్(కేరళ)లో నిర్వహించిన సభలో మోదీ ప్రసంగించారు. అప్పట్లో ఇతర పార్టీల్లోనూ మంచి వ్యక్తులు ఉండేవారని, అయితే బీజేపీని స్థాపించినవాళ్లు ఇతర పార్టీల్లోని వారికంటే మంచివాళ్లని, పార్టీ సిద్ధాంతాలుగానీ, విధానాలుగానీ పేదలకు మేలు చేసేలా ఉండటమే అందుకు నిదర్శనమని నరేంద్ర మోదీ అన్నారు. పేదల సంక్షేమమే బీజేపీ మూల స్వరూంమని, తాను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజా సేవ చేయడానికేనని, సంపాదన కోసం కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియ మారాలి సువిశాల భారతావనిలో సుదీర్ఘంగా సాగే ఎన్నికల ప్రక్రియ మారాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహం, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఎన్నికలు జరుగుతుండటమే దీనికి కారణం. అందుకే దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరగాలని బీజేపీ కోరుతోంది. తద్వారా సామాన్యుడికి మరింత మేలు జరగడమేకాక ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని మేం నమ్ముతున్నామని పేర్కొన్నారు. హింసోన్మాదులపై నిప్పులు 'బీజేపీ బీజేపీ కార్యవర్గ సమావేశంలో భాగంగా గడిచిన మూడు రోజులుగా కొజికోడ్ లో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న నేను కొందరు కార్యకర్తలను కలిశాను. ప్రత్యర్థులు తమపై జరుపుతున్న పాశవిక దాడుల గురించి వాళ్లు వివరించారు. ప్రజాస్వామ్యంలో హింసోన్మాదులకు చోటులేదు. దమ్ముంటే ప్రజాస్వామ్య యుతంగా ప్రజల కోసం పోరాడాలికానీ మా కార్యకర్తపై దాడులు చేయడం హేయం'అని ప్రధాని మోదీ అన్నారు. కేరళలో బీజేపీ కార్యకర్తపై జరుగుతోన్న దాడులపై రచించిన 'ఆహుతి' పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు. 'ఆహుతి'పై అన్ని రాష్ట్రాల్లో చర్చ జరగాలి. కేరళ కార్యకర్తలకు దేశమంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్యనాయకులు, వేల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


