జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో గందరగోళం  | BJP opposes Omar Abdullah fresh statehood resolution | Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో గందరగోళం 

Sep 26 2026 6:20 AM | Updated on Sep 26 2026 6:20 AM

 BJP opposes Omar Abdullah fresh statehood resolution

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో శుక్రవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర హోదాను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అందులో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) ప్రభుత్వం 2000లో ప్రవేశపెట్టిన స్వయం ప్రతిపత్తి తీర్మానం ప్రస్తావన ఉండటంతో వివాదం మొదలైంది. దీనిపై భాజ పా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వయం ప్రతిపత్తి అంశంపై చర్చను అనుమతించబోమని వారు స్పష్టం చేశారు.

 భాజపా సభ్యులు సభ మధ్యలోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ఈ క్రమంలో తీర్మానం ప్రతులను చించివేశారు. ‘‘సభలో స్వయంప్రతిపత్తి అంశంపై చర్చను అనుమతించబోము’’అని భాజ పా ఎమ్మెల్యే ఆర్‌.ఎస్‌. పఠానియా అన్నారు. తీర్మానాన్ని సభకు సమర్పించకుండానే ఒమర్‌ నేరుగా ప్రవేశపెట్టారని, ఇది నిబంధనల ఉల్లంఘన అని బీజేపీ ఎమ్మెల్యేలు వాదించారు. గందరగోళ పరిస్థితుల్లో బీజేపీ ఎమ్మెల్యే రణ్‌ధవాను మార్షల్స్‌ అసెంబ్లీ బయటకు తీసుకెళ్లిపోయారు. శాంతించమని స్పీకర్‌ అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ చేసిన విజ్ఞప్తు లు ఫలించకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement