breaking news
lalbagca Raja
-
మధుబాల రూ. 500 కానుక.. పూజారి సీన్ వైరల్!
ముంబై: ప్రముఖ నటి మధుబాల వినాయక చవితి వేళ ముంబైలోని ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా గణపతి మండపాన్ని సందర్శించి గణపయ్య ఆశీస్సులు తీసుకున్నారు. అయితే ఆమె దర్శనానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో మధు సమర్పించిన రూ.500 నోటును సమీపంలో ఉన్న ఓ వ్యక్తి తీసుకుని వస్త్రం కింద పెట్టినట్లు కనిపించడం చర్చకు దారితీసింది.గణపతికి రూ.500 సమర్పించిన మధూ షావైరల్ వీడియోలో మధు లాల్బాగ్చా రాజా వద్దకు వెళ్లి రూ.500 నోటును సమర్పించినట్లు కనిపిస్తోంది. అనంతరం ఆమె అభిమానుల వైపు తిరిగి చేతులు ఊపారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ నోటును తీసుకుని, ఓ వస్త్రం కింద పెట్టినట్లు వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాన్ని ఎవరో కెమెరాలో చిత్రీకరించడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సోషల్ మీడియా యూజర్స్ దీనిపై స్పందించారు.కొందరు ఈ ఘటనను విరాళాల విషయంలో జరుగుతున్న మోసాలతో పోల్చారు. మరికొందరు ఆలయాలు, దర్గాల్లో సమర్పించే కానుకలు ఎక్కడికి చేరుతున్నాయనే అంశంపై తమ అనుభవాలను పంచుకున్నారు. మరో నెటిజన్ ‘రామాలయంలోనే దోపిడీ జరిగింది.. ఇందులో పూజారి తప్పేముంది?’ అంటూ ప్రశ్నించారు. ఇలా వైరల్ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా లాల్బాగ్చా రాజా దర్శనానికి సంబంధించిన ఫొటోలను మధు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. View this post on Instagram A post shared by Batamiwala (@marathi_batamiwala)ఇదీ చదవండి: వార్తల్లో మనోజ్ తివారీ రెండో భార్య.. ఏం చేస్తుంటారంటే.. -
కోర్కెలు తీర్చే మార్కెట్ గణపతి
ఒకే దేవుడికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ముంబైలో ‘లాల్బాగ్ చా రాజా’ వినాయకుడు కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందాడు. ఈ వినాయకుడిని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే ఈ వినాయకుడు అందరికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. ముంబై నగరంలోని లాల్బాగ్ ప్రాంతంలో కొలువైన ఈ విఘ్ననాయకుడిని ‘లాల్బాగ్ చా రాజా’ అనే పిలుస్తారు. అదే పేరుతో ఇక్కడ గణేషోత్సవ మండలి ఏర్పడి, ఎనిమిది దశాబ్దాలుగా గణనాయకుడికి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతున్నాయి. ఇక్కడ ప్రతిష్టించబడిన వినాయకుడి ని ‘నవ్సాచా గణపతి’ అంటే కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేర్కొంటారు. 1934 నుంచి ప్రారంభం... లాల్బాగ్ ప్రాంతంలో 1934లో తొలుత గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన సమయంలో భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం జోరుగా కొనసాగుతోంది. అందువల్ల తొలినాళ్లలో ఈ మండలిని ‘సార్వజనీక్ గణేషోత్సవ్ మండల్ లాల్బాగ్’ అని పిలిచేవారు. ఈ ఉత్సవాలు నిర్వహించడానికి వెనుక పెద్ద కథ ఉంది. 1932లో ‘పెరు చాల్’ వద్ద ఉన్న మార్కెట్ మూతపడడంతో ఇక్కడి చిరు వ్యాపారులు, మత్స్యకారులు ఆందోళన చెందారు. మార్కెట్ కోసం తమకు మంచి స్థలం లభిస్తే గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తామని మొక్కుకొన్నారు. ఫలితంగా వారికి లాల్‌బాగ్‌లో ప్రాంతంలో స్థలం లభించింది. దీంతో ఇదే లాల్బాగ్ మార్కెట్లో 1934 సెప్టెంబర్ 12వ తేదీ న ఉత్సవాలు ప్రారంభించారు. తొలినాళ్లలో చిన్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. ఇదే నేడు మహామండలిగా ఎదిగి లక్షలాది భక్తులకు తీర్థస్థలంగా మారింది. కాగా, నాటి నుంచి నేటి వరకు రత్నాకర్ కాంబ్లీ వంశస్తులు లాల్బాగ్చా రాజా గణపతి విగ్రహాన్ని తయారు చేస్తూ వస్తున్నారు. స్వచ్ఛందసేవ.... లాల్బాగ్చా రాజా మండలికి భారీ మొత్తంలో వచ్చే డబ్బు, బంగారం, ఇతర కానుకలు, విలువైన వస్తువులను మండలి స్వచ్ఛందంగా సేవల కోసం వినియోగిస్తోంది. బీహార్‌లో వరదలు వచ్చినప్పుడు, 1962, 1968 యుద్ధ సమయాల్లో కూడా భారత ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని అందించింది. విద్యా సంస్థల భవనాల నిర్మాణం కోసం కొంత ధనాన్ని కేటాయిస్తున్నారు. భారత సైన్యం కోసం 1990లో లక్ష రూపాయల నిధితో ‘ఆర్మీ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్’ ను ఏర్పాటు చేసింది. ఈ ఫండ్ ద్వారా యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు లాల్బాగ్చా రాజా ఆర్థిక సహాయం అందజేస్తుంది. లాల్బాగ్చా రాజా తమ సొంత వెబ్‌సైట్‌ను 2000 సంవత్సరంలో www.lalbaugcharaja.comపేరుతో రూపొందించింది. - జి.ఎస్. ఫొటోలు: పి.ఆర్, సాక్షి ముంబై


