బెంగళూరు: ర్యాపిడో బైకు రైడరు ఒకరు యువతితో రైడ్‌లో నడుచుకున్న తీరు కర్ణాటకలో వైరల్‌గా మారింది. యువతిని బైకుపై కూర్చోబెట్టుకోలేదు. ఓటీపీ తీసుకుని యువతికి హెల్మెట్ ఇచ్చి 10 కి.మీ. దూరం వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరు నగరంలో ఓ యువతి ర్యాపిడో బుక్ చేయగా రైడరు వచ్చాడు. వెంటనే యువతి ఓటీపీ తెలిపింది. రైడరు యువతికి హెల్మెట్ ఇవ్వగానే దానిని ధరించేందుకు ఆమె సిద్ధమైంది.
ఆమె బైక్ ఎక్కినట్లు భావించిన రైడర్ ముందుకెళ్లి పోయాడు. ఇలా 10 కి.మీ. దూరం వెళ్లిన తర్వాత అసలు విషయం గుర్తించాడని రిటైర్ స్పోర్ట్స్ ఫ్యాన్ క్రిప్‌క్రాప్ అనే వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై పలువురు నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. కన్నడ సినిమా గాళిపటను గుర్తుకు తెచ్చుకున్నారు. మరికొందరు ఇలా జరగడం సహజమని తెలిపారు.


