తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని మారెల్లలో పొలం పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీకి సోమవారం వజ్రం దొరికినట్టు సమాచారం. దాదాపు రెండు క్యారెట్లు ఉన్న ఈ వజ్రాన్ని మంగళవారం పగిడిరాయిలో గుత్తికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి వేలంలో రూ.1,10,900లకు కొన్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో వజ్రం దొర కడం చాలా అరుదు. ఎక్కువగా జొన్నగిరి, పగిడిరాయి, జీ.ఎర్రగుడి, గిరిగెట్ల, ఉప్పర్లపల్లి, బొల్లవానిపల్లి పరిసరాల్లో తొలకరి వర్షాలు పడినప్పుడు వజ్రాలు దొరుకుతుంటాయి. వర్షాలు లేక ఈ ఏడాది రెండు వజ్రాలు మాత్రమే లభ్యమైనట్లు తెలుస్తోంది.


