CISF జవాన్‌ కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్! | Latest updates on jammu and kashmir kathua cisf jawan issue | Sakshi
Sakshi News home page

CISF జవాన్‌ కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్!

Sep 30 2026 5:07 PM | Updated on Sep 30 2026 5:58 PM

Latest updates on jammu and kashmir kathua cisf jawan issue

జమ్మూకశ్మీర్: కతువా జిల్లాలో జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. బసోహ్లీలోని ముష్కా గ్రామంలో ఉన్న సేవా-3 హైడ్రాలిక్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ వద్ద సీఐఎస్‌ఎఫ్‌ యూనిట్‌లో తోటి జవాన్లపై ఓ హెడ్‌ కానిస్టేబుల్ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు జరిపిన దర్యాప్తులో ఈ దారుణానికి దారితీసిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ యూనిట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అవదేశ్‌ కుమార్‌ సింగ్‌, అతని భార్య, హెడ్‌ కానిస్టేబుల్‌ పూజాదేవి కూడా అదే యూనిట్‌లో వేరే ప్రాంతంలో పనిచేస్తున్నారు. భార్యాభర్తలు వేర్వేరు షిప్ట్‌లలో విధులు నిర్వర్తించేవారు. అయితే డ్యూటీకి వెళ్లేటప్పుడు, వస్తున్నప్పుడు తమ చిన్నారిని చూసుకోవడం కోసం ప్రాజెక్ట్ ప్రదేశానికి తీసుకురావడంతో ఈ వివాదం మొదలైంది.

ప్రాజెక్ట్ ప్రదేశానికి చిన్నారిని తీసుకురావద్దని, అక్కడ ఉండటానికి అనుమతి లేదని యూనిట్ యంత్రాంగం, అధికారులు పలుమార్లు వారిని కోరారు. మంగళవారం కూడా వారిలో ఒకరు చిన్నారిని జీవిత భాగస్వామికి అప్పగించేందుకు అక్కడికి తీసుకు వచ్చారు. చిన్నారిని ఇక్కడికి తీసుకొని రావొద్దని చెప్పినా వినడం లేదని, ఈ రోజుకూడా చిన్నారిని తెచ్చారంటూ  కంపెనీ కమాండర్‌కు ఫిర్యాదు చేశారు.

Jawan Who Shot Dead 4 Colleagues In J&K Had Argued Over Bringing Child To Office

కాల్పులకు తెగబడిన నిందితుడు 
అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండేకు ఈ విషయంపై ఫిర్యాదు అందడం, దానితోపాటు అప్పగింతల వివాదం తారాస్థాయికి చేరడంతో అవదేశ్‌ కుమార్‌ సింగ్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మంగళవారం సాయంత్రం 6:40 గంటల ప్రాంతంలో ప్రధాన ద్వారం సమీపంలోని ఆపరేషన్స్ విభాగం కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ తనకు కేటాయించిన ఏకే-47 రైఫిల్‌తో అక్కడున్న సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అతని వద్ద 150 రౌండ్ల మందుగుండు సామగ్రి ఉన్నట్లు సీఐఎస్‌ఎఫ్ వెల్లడించింది.

ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది 
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నలుగురు సిబ్బందిని వెంటనే చికిత్స నిమిత్తం హిమాచల్ ప్రదేశ్‌లోని ఎన్‌‌హెచ్‌పిసి ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతి చెందిన వారిని అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్-ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుల్ రఫీక్ అహ్మద్, కానిస్టేబుల్ సందీప్ కుమార్‌గా గుర్తించారు.

అదుపులోకి తీసుకున్న పోలీసులు 
కాల్పుల అనంతరం ఇతర సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమై నిందితుడు అవదేశ్‌ కుమార్‌ సింగ్‌‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

ఇదీ చదవండి : తోటి జవాన్లపై CISF జవాన్ కాల్పులు.. నలుగురు మృతి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement