న్యూఢిల్లీ: నమోభారత్ రైళ్లలో ప్రయాణం ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా మారింది. రోజువారీ ప్రయాణికుల కోసం నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రా¯న్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సీఆర్‌టీసీ) కొత్త ట్రిప్ పాస్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. నిత్యం ఒకే రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించే ప్రయాణికులు, పదేపదే టిక్కెట్లు కొనడం, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులను రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి గరిష్టంగా 40 ట్రిప్పులను కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.
ప్రయాణికులు తమకు అవసరమైన 15 లేదా 20 లేదా 40 ట్రిప్‌లకు పాస్‌ను ముందుగానే కొనుగోలు చేయొచ్చు. అదే రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించిన తర్వాత ఆ ట్రిప్‌కు సంబంధించిన చార్జీ మాత్రమే ఆ మొబిలిటీ కార్డ్ నుంచి ఎన్‌సీఆర్‌టీసీ తీసుకుంటుంది. ఈ సౌకర్యం స్టాండర్డ్, ప్రీమియం కోచ్‌లు రెండింటికీ అందుబాటులో ఉంది. (Namo Bharat Train)
ఒక ట్రిప్ పాస్ 15 రోజుల్లో, 10 ట్రిప్పుల పాస్‌లు 30 రోజుల్లో, 15, 20 ట్రిప్పుల పాస్‌లు 60 రోజుల్లో పయోగించుకోవాల్సి ఉంటుంది. 40 ట్రిప్పుల పాస్ అయితే మూడు నెలలపాటు చెల్లుబాటు అవుతుంది. ట్రిప్ పాస్ ఎంచుకున్న నిర్దిష్ట స్టేషన్ల మధ్య మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రోజువారీ ప్రయాణాలు కొనసాగించే వారికి ఈ సౌకర్యం ప్రయోజనం చేకూరుస్తుందని కార్పొరేషన్ తెలిపింది.
ఇదీ చదవండి: ఫాస్టాగ్ వార్షిక పాస్‌ల జోరు.. కీలక మైలురాయి


