అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

 collector dharma reddy fire misanbhagiratha Officers - Sakshi

పనులు పూర్తి చేస్తామని విస్మరిస్తున్నారంటూ అసహనం 

వర్షాకాలంలో వస్తే పనులు ఎలా పూర్తి చేస్తారంటూ ప్రశ్న 

మిషన్‌ భగీరథ త్వరగా పూర్తిచేయాలని సూచించిన కలెక్టర్‌ 

సాక్షి, మెదక్‌: మిషన్‌భగీరథ అధికారులపై కలెక్టర్‌ ధర్మారెడ్డి శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్‌భగీరథ పనుల అమలును సమీక్షించిన కలెక్టర్‌ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నేను నిర్వహించే ప్రతీ సమావేశంలో పనులు పూర్తి చేస్తామని చెప్పటం..ఆతర్వాత విస్మరించటం పరిపాటిగా మారిదంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు కురిస్తే పనులు చేయటం కష్టమని, అప్పులు పనులు ఎలా పూర్తి చేస్తారని మిషన్‌భగీరథ ఇంజనీరింగ్‌ అధికారులను ప్రశ్నించారు.

 ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో మిషన్‌భగీరథకు శ్రీకారం చుట్టిందని, వెంటనే పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇంకా కొన్ని మండలాల్లో ఇంటింటికి నల్లా కనెక్షన్‌లు సైతం ప్రారంభంకాలేదని, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్‌భగీరథ ఇంజనీరింగ్‌ అదికారులు త్వరలోనే పనులు పూర్తి చేస్తామని కలెక్టర్‌ తెలిపారు.  సమావేశంలో మిషన్‌భగీరథ గ్రిడ్‌ ఈఈ సురేష్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ లలిత తదితరులు పాల్గొన్నారు. 

పాఠశాలల ప్రారంభం రోజునే పుస్తకాల పంపిణీ  
పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌లు అందజేయాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి విద్యాశాఖ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా లక్ష్యం మేరకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.  216 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా 56 నిర్మించారని, 280 కిచెన్‌షెడ్‌లకు 150 పూర్తి చేసినట్లు చెప్పారు.  అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో హరితహారం కార్యక్రమం కింద మొక్కలు పెంచటానికి చర్యలు తీసుకోవాలన్నారు.

 పాఠశాలల ప్రాంగణంలో మామిడి, మేడి, బాదాం, అల్లనేరడి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం రోజునే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్‌ అందజేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. హారితహారంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో మొక్కలు నాటిస్తామని తెలిపారు. సమావేవంలో డీఈఓ విజయలక్ష్మి, విద్యాశాఖఅధికారులు, ఎంఈఓలు పాల్గొన్నారు.  

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top