మెదక్ జిల్లా: పెళ్లి నిశ్చితార్థం అయిన ఓ యువతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని నర్సంపల్లి రెడ్యానాయక్‌తండాలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన దారవత్ మమత(18) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి తన సోదరుని వద్దే ఉంటోంది. ఈ క్రమంలో 16న ఎలుకల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది.
అది గమనించిన కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుంచి ఆర్‌వీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. మమతకు కొన్ని రోజుల క్రితం వివాహ నిశ్చితార్థం జరిగిందని, అయితే కుటుంబ ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణం అని కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


