విజయవాడ: నగరంలోని భవానీపురం పున్నమి ఘాట్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆవకాయ అమరావతి ఫెస్టివల్ ఎగ్జిబిషన్‌ను ఉన్నపళంగా కూల్చివేయడానికి టౌన్ ప్లానింగ్ అధికారులు సిద్ధమైన తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ కూల్చివేత కార్యక్రమానికి నిర్వాహకులు అడ్డుకున్న నేపథ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ పున్నమి ఘాట్‌లో ఆవకాయ అమరావతి పెస్టివల్ నిర్వహించడానికి అంతా సిద్ధం చేసుకున్నారు
ఎగ్జిబిషన్ నిర్వాహకులు. అయితే దాన్ని తీసువేయాలని చెప్పి.. ఇవాళ కూల్చివేత కార్యక్రమం చేపట్టడంతో ఎగ్జిబిషన్ నిర్వహాకులు ఆందోళనకు దిగారు. నోటీసుల్లో వారం రోజులు గడువు అని ఉండగా, ఉన్నపళంగా కూల్చివేయడంపై మండిపడుతున్నారు. ఎగ్జిబిషన్‌ను ఇప్పటికిప్పుడు తొలగించాలంటే కోట్ల రూపాయిలు నష్టం వస్తుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల్లో వారం రోజులు గడువు ఇచ్చారని, ఇవాళ కూల్చివేతలకు దిగారని మండిపడుతున్నారు. ఇప్పటివరకూ ఐదు కోట్ల రూపాయిలు ఖర్చుపెట్టామని, ఉన్నపళంగా తీసేసేమంటే రోడ్డున పడే పరిస్ధితి వస్తుందని అంటున్నారు.


