తిరుపతి: అన్నమయ్య జిల్లా, పుల్లంపేట మండలంలోని ఎగువ రెడ్డిపల్లికి చెందిన రైతు తన పిల్లల చదువుల కోసం తిరుపతి రూరల్ ఓటేరు పంచాయితీలోని శ్రీవాణి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే రైతు ఫోన్ నెంబర్ వాట్సప్‌కు PMJY కిసాన్ యోజన పథకం పేరుతో ఉన్న లింక్ వచ్చింది. లింక్ ఓపెన్ చేయడంతో వ్యక్తిగత వివరాలను అడిగిన సైబర్ నేరగాళ్లకు తన వివరాలు తెలిపాడు రైతు.
దాంతో రైతు అకౌంట్లో ఉన్న 10 లక్షల 81 వేల రూపాయలలో 7.50 లక్షల నగదు విత్ డ్రా అయినట్టు రైతు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. తన అకౌంట్ నుండి 7.50 లక్షల నగదు సైబర్ నేరగాళ్లు కొట్టేశారని గ్రహించిన బాధితుడు.
వెంటనే 1930కు కాల్ చేసి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాడు. తను మోసపోయినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ మేరకు కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ పోలీసులు. సైబర్ నేరగాళ్లను చేధించే పనిలో పడ్డారు.


