యూరియా.. పచ్చ సిఫార్సు కావాలయా?
‘యూరియా కావాలా.. అయితే టీడీపీ నేత ఎవరైనా సిఫార్సు చేయాలి. లేకపోతే మేము ఇవ్వలేం. మా వల్లకాదు.. మీరు టీడీపీ నేతలెవవరితోనైనా చెప్పించండి. లేదా వెళ్లిపోండి.. మేమీ చేయలేం..’ బాలాయపల్లి మండలం పిగిలాం పంచాయతీలో వ్యవసాయాధికారులు అంటున్న మాటలు.. ఈ స్థితిలో యూరియా దొరక్క.. ఏమి చేయాలో పాలుపోక రైతులు ఇక్కట్లు పడుతున్నారు.
వెంకటగిరి రూరల్: బాలాయపల్లి మండలంలో టీడీపీ నేతల సిఫారసు ఉంటేనే అధికారులు రైతులకు యూ రియా సరఫరా చేస్తున్నారు. మండలంలోని పిగిలాం పంచాయతీ పరిధిలోని రైతులకు అధికారులు యూరి యా కోసం పంపిణీ చేసిన స్లిప్పులు తీసుకుని రైతు భరోసా కేంద్రానికి వెళితే టీడీపీ నేతల సిఫారసులో మీ పేరు ఉందా? అని అధికారులే ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలు ఏకంగా సచివాలయాల్లో తిష్టవేసి తమకు అనుకూలమై న రైతులకు యూరియా పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎరువుల దుకాణాల్లో యూరియా కొనుగోలు చేసుకుందామనుకుంటే యూరియా బస్తా రూ.320 చెల్లించి కొనుగోలు చేయడంతోపాటు గుళికలు, పాస్పెట్, పిచికారీ మందులను కొనుగోలు చేస్తేనే యూరియాను ఇస్తామని డీలర్లు రైతులకు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఇటు సచివాలయాల్లో ఇస్తున్న యూరియా తీసుకోలేక అటు ఎరువుల దుకాణంలో మందులను కొనుగోలు చేయ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో యూరి యా పంపిణీ పంపిణీపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
గ్రామాల్లో వ్యవసాయ శాఖాధికారుల పర్యవేక్షణ కొరవడుతుంది. అధికార పార్టీకి చెందిన నేతలు సచివాలయాల్లో తిష్టవేసి యూరియా పంపిణీలో పెత్తనం చెలాయించడం సమంజసం కాదు.
– మల్లెల వెంకటేశ్వర్లు, పిగిలాం
తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం
యూరియా కోసం అధికారులు ఇచ్చిన స్లిప్పులు తీసుకెళితే సి ఫార్సులు ఉన్నాయని అధికారు లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. అటువంటప్పులు స్లిప్పులు అధికారులు ఇవ్వడం ఎందుకు?.
– మావిళ్ల బాలాజీ, పిగిలాం
యూరియా.. పచ్చ సిఫార్సు కావాలయా?
యూరియా.. పచ్చ సిఫార్సు కావాలయా?


