శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తుల వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,823 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,6660 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారి కి కానుక ల రూపంలో హుండీలో రూ.4.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగి న భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలో కి అనుమతించరని స్పష్టంచేసింది.
తెలంగాణ సీఎంకు స్వాగతం
తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తిరుమలలో సాదర స్వాగతం లభించింది. సోమవారం రాత్రి ఆయన తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు ఆయనకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. కాగా రేవంత్‌రెడ్డి మంగళవారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
వేటూరి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి కల్చరల్: వేటూరి సుందరరామమూర్తి సాహితీ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మన సంస్కృతి సంస్థ జిల్లా ప్రతినిధి డాక్టర్ షేక్ మస్తాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పురస్కారాలకు తెలుగు ఉపాధ్యాయులు, రచయితలు అర్హుల ని పేర్కొన్నారు. వేటూరి జయంతిని పురస్కరించుకుని జనవరి 29వ తేదీన వెటర్నరీ కళాశాల ఆడిటోరియంలో వేటూరి సాహితీ పురస్కారాలు ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పాడుతా తీయగా విజేతలతో వేటూరి సుందరరామమూర్తికి స్వరనీరాజనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన తెలుగు ఉపాధ్యాయులు, రచయితలు జనవరి 10వ తేదీలోపు దరఖాస్తులు పంపాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 7396049947ను సంప్రదించాలన్నారు.
డక్కిలి బాలికకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు
డక్కిలి: మండలానికి చెందిన బాలికకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్‌ుడ్సలో చోటు దక్కింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో శనివారం 7,500 మంది దేశ విదేశాల నర్తకీలతో తెలంగాణ ప్రభుత్వం, భారత్ ఆర్ట్ అకాడమీ నిర్వహించిన కూచిపూడి నాట్య ప్రదర్శనలో డక్కిలి ప్రాంతానికి చెందిన జోగి ఆరాధ్య పాల్గొంది. ఈ మేరకు ఆ బాలికకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధులు ధ్రువపత్రం అందజేశారు. కార్యనిర్వాహకులు అభినందనలు తెలియజేశారు.
స్కేటింగ్ పోటీల్లో
తిరుపతి విద్యార్థినికి కాంస్యం
తిరుపతి సిటీ: గ్వాలియర్‌లో డిసెంబర్ 26 నుంచి 29వ తేదీ వరకు జరిగిన 69వ జాతీయ స్థాయి స్కేటింగ్ వెయ్యి మీటర్ల పోటీల్లో తిరుపతికి చెందిన కె.ఖ్యాతి కాంస్య పతకం కై వసం చేసుకుంది. అలాగే ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగిన 63వ జాతీయ స్కేటింగ్ పోటీల్లో రిలే రేస్ (2వేల మీటర్లు) గోల్డ్ మెడల్, రోడ్ 4 రేస్ (650 మీటర్లు) పోటీల్లో కాంస్య పతకాన్ని కె.ఖ్యాతి సాధించింది. కె. ఖ్యాతి భాష్యం పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
శ్రీవారి దర్శనానికి 8 గంటలు


