విద్యార్థిని ఖాతా ఖాళీ
సైబర్ నేరగాళ్ల ఆన్‌లైన్ మోసం
వాకాడు: ఓ పేద గిరిజన విద్యార్థిని ఇన్‌స్ట్రాగామ్ ఆన్‌లైన్ మోసానికి గురయ్యాడు. ఆ విద్యార్థిని అకౌంటులోని సొమ్ము సోమవారం ఖాళీ అయ్యింది. బాధిత విద్యార్థిని కథనం మేరకు.. మండల కేంద్రమైన వాకాడు బంగ్లా గిరిజన కాలనీకి చెందిన పేద విద్యార్థిని ఈగా ధరణి పాలటెక్నిక్ చదువుతోంది. ఇన్‌స్ట్రాగామ్‌లో పెన్సిల్ హోమ్ వర్క్ అనే పేరుతో వచ్చిన ఓ మేస్సేజ్‌ని ఆన్ చేసింది. వెంటనే సంస్థ ప్రతినిధులమంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. తొలుత రూ. 650 తమ అకౌంటుకి పే చేస్తే ఐడీ క్రియేట్ చేస్తామని, ఆ తరువాత రూ.6 వేలు వేస్తే తొలి వేతనంగా రూ.18 వేలు మీ అకౌంట్లో వేస్తామని నమ్మబలికిన మోసగాళ్లు విద్యార్థి నుంచి రూ.6,650 దోసేశారు. వెంటనే కాల్ చేసి మరో రూ.5 వేలు వేయాలని, లేదంటే మీ ఆధార్ కార్డుపై తాము లోన్ తీసుకుని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తామని ఫోన్‌లో బెదిరింపులు మొదలుపెట్టారు. వారి టార్చర్ తట్టుకోలేని విద్యార్థిని వాకాడు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


