కలెక్టర్, డీఆర్వో లేరు...జేసీ రారు
తిరుపతి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)పై ఎన్నో ఆశలతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అర్జీదారులు వ్యయప్రయాసలకోర్చి సోమవారం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అయితే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, డీఆర్వో నరసింహులు జిల్లాల సర్దుబాటు నేపథ్యంలో విజయవాడకు వెళ్లారు. ఇక ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌కు హాజరుకాలేదు. ఆమె తిరుపతి నగర కమిషనర్‌గా ఉండడంతో అక్కడే గ్రీనెన్స్‌కు హాజరయ్యారు. కీలకమైన ఆ ముగ్గురు అధికారులు గ్రీవెన్స్‌లో లేకపోవడంతో పలువురు అర్జీదారులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు చేతుల్లోకి పీజీఆర్‌ఎస్ వెళ్లిందని సమాచా రం అందుకున్న పలు విభాగాలకు చెందిన జిల్లా అధికారులు గ్రీవెన్స్‌కు డుమ్మా కొట్టారు. మరికొందరు తమ సబార్డినేటర్లను గ్రీవెన్స్‌కు పంపించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్‌మాండ్, శివశంకర్ నాయక్, సుధారాణి అర్జీలను అందుకున్నారు. గ్రీవెన్స్‌కు 428 అర్జీలు వచ్చాయి అందు లో 270 అర్జీలు రెవెన్యూ సమస్యలపై, 40 అర్జీలు పింఛన్ల కోసం ఇచ్చారు. మఖ్యమైన ముగ్గురు అధి కారులు లేకపోవడంతో అర్జీదారులు తీవ్రమైన అసంతృప్తి చెందారు.
దేవస్థానం భూములు గోల్‌మాల్ చేస్తున్నారు
తమ గ్రామం పరిధిలో వేణుగోపాలస్వామి, నాగలింగేశ్వర స్వామి ఆలయాలకు చెందిన భూము లు వేలం పాట ద్వారా కాకుండా ఆలయాధికారులు తమకు ఇష్టం వచ్చిన వారికి ఇచ్చేస్తున్నారని డక్కిలి మండలం దగ్గోవోలు గ్రామవాసి దగ్గోలు పాపయ్య ఫిర్యాదు చేశారు. వేలం పాటలో పాడుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయినా తమకు ఇవ్వడం లేదన్నారు.
కలెక్టరేట్ వద్ద గిరిజనుల దీక్ష
సూళ్లూరుపేట మండలంలోని కడపత్రి పంచాయతీ పాటిమిట్ట గిరిజన కాలనీకి దారి లేకపోవడంతో వారంతా సో మవారం కలెక్టరేట్‌లో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఉదయం నుంచి సా యంత్రం వరకు దీక్ష కొనసాగించారు.
పింఛన్ కోసం విచ్చేసిన మానసిక రోగి శివసాయితో తల్లి
మా కుమారుడు శివసాయి. మానసిక రోగి కావ డంతో మంచానికే పరిమితం అయ్యారు. పింఛన్ ఇస్తే ఆ డబ్బులతో వైద్య ఖర్చులు పెట్టుకుంటామ ని. రేణిగుంట మండలంలోని ఎర్రమరెడ్డి పాళెం గ్రామానికి చెందిన మంజులమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్, డీఆర్వో లేరు...జేసీ రారు


