అసంబద్ధం
చిన్న జిల్లాగా మారిన చిత్తూరు రాజకీయ కక్షతో పుంగనూరు అన్నమయ్యలోకి.. పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు మాత్రం చిత్తూరులోనే.. తిరుపతి జిల్లాలోకి కోడూరు నియోజకవర్గం గూడూరులోని మూడు, వెంకటగిరిలోని మూడు మండలాలు నెల్లూరులోకి వాకాడు, చిట్టమూరు మండలాలు మాత్రం తిరుపతి జిల్లాలోకి నియోజకవర్గాల మార్పులు.. చేర్పులపై అసంతృప్తి
పునర్విభజనం..
తిరుపతి జిల్లాలో గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, చంద్రగిరి నియోజక వర్గాలు ఉండేవి. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోకి కొత్తగా కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలుపుతూ కాబినెట్ నిర్ణయం తీసుకుంది. తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కోట, చిల్లకూరు, గూడూరు మండలాలలను శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాలోకి కలిపారు. ఇదే గూడూరు నియోజకవర్గంలోని వాకాడు, చిట్టమూరు మండలాలను మాత్రం తిరుపతి జిల్లాలోనే ఉంచారు. అలాగే వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో కలిపారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు నాలుగు డివిజన్లు, 36 మండలాలను తిరుపతి జిల్లాగా ప్రకటించారు. ఇలా చేయడంతో ప్రతి ఎన్నికల్లోనూ, పాలనాపరమైన సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నమయ్య
జిల్లా
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జిల్లాల పునర్విభజన చేపట్టారనే ఒకే ఒక్క కారణంతో చంద్రబాబు ప్రభుత్వం నియోజక వర్గాలను చిందర వందరగా చేసింది. అసెంబ్లీ ఒకటైతే.. ఆ నియోజక వర్గ పరిధిలోని మండలాలను మరో జిల్లాలోకి చేర్చి గందరగోళానికి తెరతీశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని మండలాలు ఒకే నియోజకవర్గంలో ఉండడం, ఆ నియోజక వర్గం ఒకే జిల్లాలో ఉంటేనే పాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అలా కాకుండా ఇష్టమొచ్చినట్లు నియోజక వర్గాలు, మండలాలు, జిల్లాల స్వరూపాన్నే మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాభీష్టం మేరకు అని చెబుతూ.. చంద్రబాబు ప్రభుత్వం సోమవారం జిల్లాల మార్పులు, చేర్పులు చేపట్టింది. ఈ మార్పులు చేర్పుల్లో పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గంలోని సోమల, సదుం, చౌడేపల్లి, పుంగనూరు మండలాలను అన్నమయ్య జిల్లా పరిధిలోకి చేర్చారు. అదే పుంగనూరు నియోజక వర్గంలోని పులిచర్ల, రొంపిచర్ల మండలాలను మాత్రం చిత్తూరు జిల్లాలోనే ఉంచారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కక్షతోనే పుంగనూరు నియోజక వర్గాన్ని ముక్కలు ముక్కలుగా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాను విడగొట్టడంతో నాలుగు డివిజన్లు, 28 మండలాలతో చిత్తూరు చిన్నదిగా మారిపోయింది.
జిల్లాల పునర్విభజన అసంబద్ధంగా జరిగింది. టీడీపీకి అనుకూలంగా మండలాలను ఒకటిగా చేసి, వైఎస్సార్‌సీపీకి పట్టున్న మండలాలు, నియోజకవర్గాలను ముక్కలు చెక్కలు చేసింది. వేర్వేరు జిల్లాల్లోకి కలిపివేసింది. ఈ చర్యలతో పాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుదాయన్న నిపుణుల హెచ్చరికలను సైతం త్రోసిపుచ్చింది. టీడీపీ అసంబద్ధ నిర్ణయాల కారణంగా సామాన్య ప్రజలు ఇక్కట్లు పడక తప్పదని మేధావులు చెబుతున్నారు.
అసంబద్ధం


