అర్జీలు ఉచితమే.. డబ్బులు ఇవ్వకండి
తిరుపతి అర్బన్: అర్జీలు ఉచితంగానే రాసి ఇస్తున్నాం..ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు..ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి, వారిపై చర్యలు తీసుకుంటామని పెద్ద ఎత్తున మైక్ ద్వారా అనౌన్స్‌మెంట్ చేశా రు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 428 అర్జీలు వచ్చాయి. అయితే 40 నుంచి 50 అర్జీలు మాత్రమే అర్జీదారులు రాసుకుని ఇచ్చారు. మిగిలిన అర్జీలను అధికారులు ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగులు రాసి ఇచ్చారు. అయితే నెల రోజులుగా అర్జీలు రాసి ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నట్లు జోరుగా చర్చసాగుతుంది. దీంతో సోమవారం పెద్ద ఎత్తున అనౌన్స్‌మెంట్ చేశారు.
లారీని మోటారుసైకిల్ ఢీకొని వ్యక్తి మృతి
దొరవారిసత్రం: చిన్నాన్న అత్యక్రియలకు కోసం వెళ్లి తిరిగి ఇంటి వెళుతుతున్న క్రమంలో రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని మోటా రు సైకిల్ ఢీకొన్న ఘటనలో మోటారు సైకిలిస్టు మృతి చెందిన ఘటన సోమవారం నెలబల్లి సమీపంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం మేరకు... శ్రీధనమల్లి గ్రామానికి చెందిన డమాయి వంశీ(24) రెండేళ్ల నుంచి వెంకటగిరి ప్రాంతంలోని అత్తగారింటి వద్దనే బెల్దారీ పనులు చేసుకుంటూ భార్యతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వరసకు బాబాయి అయిన డమాయి వేమయ్య శ్రీధనమల్లి గ్రామంలో ఆదివారం మృతి చెందగా అంత్యక్రియల కోసం వంశీ సోమవారం బైక్‌పై శ్రీధనమల్లి గ్రామానికి వెళ్లి, అత్యక్రియలు పూర్తికాకముందే వెంకటగిరి వెళుతుండగా నెలబల్లి సమీపంలో వాసమ్మ ఆశ్రమం వద్ద రోడ్డు పక్కనే ఉన్న ఆగి ఉన్న లారీని అదుపుతప్పి ఢీకొన్నాడు. దీంతో వంశీ తీవ్రంగా గాయపడ్డాడు. అతడు తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అజయ్‌కుమార్ తెలిపారు.
ఒకటో తేదీలోపు
నమోదు చేయండి
తిరుపతి సిటీ: విద్యా వ్యవస్థలో పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, భవిష్యత్ ప్రణాళికలను సమర్థవంతంగా రూపొందించడానికి బోధ న, బోధనేతర సిబ్బందితో పాటు పాఠశాలల తాజా సమాచారం వెబ్‌సైట్లలో నమోదు చేయా లని డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల సమాచార వ్యవస్థ (టీఐఎస్), స్కూల్ ఇన్‌ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎస్‌ఐఎంఎస్)లలో ఖచ్చితమైన సమాచారాన్ని పొందుపరచాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించినట్లు ఆయన తెలియజేశారు. ఉపాధ్యాయుల వ్యక్తిగత సమాచారం నవీకరించడం, ఉపాధ్యాయుల టెట్ అర్హత, తాజా విద్యార్హతలు, పనమోదు చేయాలని సూచించారు. సాంకేతిక సమస్యలతో జిల్లాలో కనీసం ఇప్పటి వరకు 30శాతం పాఠశాలలు సైతం వివరాలను నమో దు చేయలేదు. దీంతో మరోమారు గడువును పొడిగించనున్నట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో
మహిళ మృతి
తిరుపతి క్రైమ్: నగరంలోని గరుడ వారిధిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. నగరంలోని భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటున్న శ్యామల(53) సమీపంలో నివాసం ఉంటూ తన స్నేహితురాలు రూపతో కలిసి తిరుచానూరు అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో గరుడ వారధి పై వెళుతుండగా లక్ష్మీపురం సర్కిల్ వద్ద టిప్పర్ ఆమె వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఆమెను ఢీకొంది. అయితే టిప్పర్ లారీ వెనక చక్రం ఆమె తలపై ఎక్కడంతో శ్యామల అక్కడికక్కడే మృతి చెందింది. రూపకు స్వల్ప గాయాలతో బయటపడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.
అర్జీలు ఉచితమే.. డబ్బులు ఇవ్వకండి
అర్జీలు ఉచితమే.. డబ్బులు ఇవ్వకండి


