
సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డికి ఎస్వీ వర్శిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎస్వీ గోశాలలో గోవుల మరణాలపై అసత్య ప్రచారం చేశారంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలంటూ భూమనకు నోటీసులు జారీ చేశారు.