సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎస్వీయూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న ఆర్డీవో ఆఫీస్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి.
విద్యార్థి సంఘాలపై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు ఎత్తేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ధర్నాకు మద్దతు తెలిపిన హర్షిత్ రెడ్డితో పాటు 14 మంది విద్యార్థి సంఘాల నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు.


