
వాహనాల రద్దీ అత్యధికంగా ఉండే తిరుపతిలోని రామాపురానికి వెళ్లే రోడ్డులో ఓ ఊసరవెల్లి ఒక్కసారిగా ఇలా దూసుకొచ్చింది. బిడ్డా.. ఇది నా అడ్డా, నువ్వే కాస్త చూసుకుని వెళ్లు అన్నట్లు రోడ్డు మధ్యలో కాసేపు ఆగి నిదానంగా పక్కకి వెళ్లింది. వాహనదారులు తమ వాహనాలను నెమ్మదిగా నడిపి ఊసరవెల్లి రోడ్డు దాటేవరకూ ఆగడం కనిపించింది.
సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి