
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 82,136 మంది స్వామివారిని దర్శించుకోగా 29,023 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటల సమయం. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది.
తిరుపతి చేరుకున్న కల్వకుంట్ల కవిత...
తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(mlc-kalvakuntla-kavitha) తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట యాత్ర నేపథ్యంలో తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కవిత తిరుపతి చేరుకున్నారు. తన భర్త అనిల్, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారితో కలిసి శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతి(tirupati) కి ప్రయాణమయ్యారు. కవితకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.. శనివారం హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు కవిత.