సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయన చేస్తున్న కామెంట్స్. ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఆయన చేస్తున్న కామెంట్స్ కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారుతున్నాయి. డేవిడ్ వార్నర్ నుంచి బ్రహ్మనందం వరకు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. దీంతో ఆయనపై పలువురు నెటిజన్స్ మండిపడ్డారు. ప్రతిసారి ఇలా నోరు జారడం అలవాటైపోయిందని ఫైరయ్యారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా పేరున్న రాజేంద్ర ప్రసాద్ ప్రతిసారి అలా మాట్లాడడం చూస్తుంటే అభిమానులే షాకవుతున్నారు. ఒక్కోసారి అసలు ఆయనకు ఏమైందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఈవెంట్స్లో తప్పుగా మాట్లాడడం.. ఆ తర్వాత తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారిపోయిందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏకైక నటుడిగా ఘనత..
అయితే ఇటీవల కొద్ది కాలంగా తన మాటలతో ట్రోల్స్కు గురవుతున్న రాజేంద్ర ప్రసాద్ ఓ మంచిపని కూడా చేశాడు. పవిత్రమైన తిరుమల సన్నిధిలో భక్తుల వసతి కోసం కాటేజీ నిర్మించినట్లు తెలిసింది. టి. సుబ్బరామిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఈ కాటేజీ నిర్మించానని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా తిరుమల కొండపై కాటేజీ నిర్మించిన ఏకైక నటుడిగా రాజేంద్ర ప్రసాద్ ఘనతను సొంతం చేసుకున్నారు.


