నేను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదు: భూమన | Bhumana Karunakar Reddy Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

నేను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదు: భూమన

Oct 23 2025 7:53 PM | Updated on Oct 23 2025 8:15 PM

Bhumana Karunakar Reddy Fires On Chandrababu Government

సాక్షి, తిరుపతి: తాను ఆధారాలు లేకుండా  ఏనాడు మాట్లాడలేదని.. తనపై వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి  అన్నారు. ‘‘11.04.25న మీడియా సమావేశంలో గోశాలలో గోవులు అధికంగా మరణిస్తున్నాయని నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా’’ అని భూమన స్పష్టం చేశారు.

‘‘గోవుల పట్ల నిర్లక్ష్యంగా తగదని నేను మాట్లాడాను. పోలీస్ విచారణకు పిలిచారు. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండ అసభ్య పదజాలంతో కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నేను వాస్తవాలు చెబితే సమాధానాలు ఇవ్వడం లేదు. వాళ్ల మీడియాలో నాపై విష ప్రచారం చేస్తున్నారు. మీ చేతిలో అధికారం ఉంది. విచారణ చేయించాలి కదా?’’ అంటూ భూమన ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement