‘టీడీపీకి ఓటువేయొద్దు.. నాశనమైపోతారు’ | Chittoor Puthalapattu TDP Worker Selfie Video Goes Viral, Urges Public Not To Vote For TDP After Alleged Police Torture | Sakshi
Sakshi News home page

‘టీడీపీకి ఓటువేయొద్దు.. నాశనమైపోతారు’

Oct 14 2025 9:44 AM | Updated on Oct 14 2025 10:32 AM

Puthalapattu: Tdp Worker Selfie Video Goes Viral

చిత్తూరు జిల్లా: ‘నేను తెలుగుదేశం పార్టీకే ఓటువేశా. ఓటు వేసి కూడా నాకు న్యాయం జరగకుండా పోయింది. ఎవరూ  తెలుగుదేశానికి ఓటు వేయకండి. నాశనమైపోతారు. నా.. పో­తారు. వద్దు..’ అంటూ చిత్తూరు జిల్లా పూతలప­ట్టుకు చెందిన ఓ యువకుడి సెల్ఫీ వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. పూతలపట్టు మండలం  రామాపురానికి చెందిన దినేష్‌ ఆదివారం రాత్రి ఓ ప్రభుత్వ బండిని ఢీకొట్టాడని తెలిసింది.

ఆ తర్వాత ఒక వీడియో వైరల్‌ అయింది. తనను పోలీస్‌ స్టేష­న్‌కు తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారంటూ పసికందుతో ఉన్న దినేష్‌ పోస్ట్‌ చేసిన వీడియో అందరిని కంటతడి పెట్టించింది. కొందరు కూటమి నాయకుల ప్రోద్బలంతో తనను అక్రమంగా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియోతో మరో సెల్పీ వీడియో పెట్టాడు.

వివరాలు అతడి మాటల్లోనే.. ‘నా పేరు దినేష్, నా భార్య సుభద్ర, నా కూతురు సహస్ర. టీడీపీ నాయకులు యువరాజులునాయు­డు, దొరబాబు చౌదరి, గణపతి నాయుడు వల్లే మా ప్రాణాలు పోతాయి. వాళ్లు పోలీసు స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టించారు. నేను తెలుగుదేశం పార్టీకే ఓటు వేశాను. నాకు న్యాయం జరగలేదు. కానీ ప్రజలకు ఒక్కటే చెబుతున్నా.. ఎవ్వరూ కూడా ఆ పార్టీకి ఓటు వేయొద్దు.  నాశనం అయిపోతారు. నా.. పోతారు. వద్దు..’  అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వరుస  వీడియోలు పూతలపట్టులో చర్చనీయాంశంగా మారాయి.

Chittoor District : బాధితుడు దినేష్ సెల్ఫీ వీడియో వైరల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement