
సాక్షి, తిరుపతి: సోషల్ మీడియాలో చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారంటూ వైఎస్సార్‌సీపీ నార్త్ క్లస్టర్ విభాగం అధ్యక్షుడు నవీన్‌ను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ భూమన అభినయ్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు అలిపిరి పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. భూమన అభినయ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యంపై తప్పులు ఎత్తి చూపిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులతో పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. దీనిలో భాగంగానే నవీన్‌పై కేసు పెట్టారన్నారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఎక్సైజ్ ఎస్‌ఐ ఇచ్చిన ఫిర్యాదుపై అరెస్ట్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఒక తీవ్రవాదిని బంధించినట్టు పది మంది పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది?. తప్పుడు కేసులతో వైఎస్సార్‌సీపీ నాయకులు భయపడే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని అభినయ్‌రెడ్డి పేర్కొన్నారు.