
సాక్షి, ఢిల్లీ: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల హింసపై ఏపీ డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. ఎస్వీయూ క్యాంపస్‌లో జరిగిన హింసపై ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల హింసపై ఎంపీ గురుమూర్తి చేసిన ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆదేశాలు ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ నేతలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని గతంలో నివేదిక ఇచ్చి ఏపీ డీజీపీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దాంతో మరోసారి తాజా దర్యాప్తు నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.