జిల్లాలోనే ఎడ్ల పందేలు (జల్లికట్టు)కు అత్యంతం ప్రాధాన్యత ఉన్న గ్రామం రంగంపేట.
బుధవారం ఉదయమే పశువుల యజమానులు జల్లికట్టుకు కోడెగిత్తలను సిద్ధం చేశారు. కొమ్ములకు పలకలు కట్టి.. నడుముకు నల్లదారం చుట్టి ముస్తాబు చేశారు.
ఆపై జనం మధ్యలో విడిచి పెట్టారు. కోడెగిత్తలు జనాన్ని చూసి కాలుదువ్వుతూ.. రంకెలేస్తూ దూసుకుపోయాయి. వీటిని నిలువరించేందుకు.. కొమ్ములకు కట్టిన పలకలు సొంతం చేసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు.
సుమారు గంటన్నర పాటు సాగిన ఈ పరుష పందేలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


