
‘ఇన్నాళ్లూ తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టారు.. సైన్స్ ల్యాబ్‌ల్లో మెదడుకు పదును పెట్టి ఎన్నో ప్రయోగాలు చేశారు.. భావి శాస్త్రవేత్తలుగా బయటకు వెళుతున్న మీరంతా దేశ సౌభాగ్యం కోసం కలలు కనాలి. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై పరిశోధనలు చేసి, పరిష్కారాలను కనుగొనాలి.’ అని గోదావరి బయో రిఫైనరీస్ చైర్మన్ సమీర్ సోమయ్య పిలుపునిచ్చారు.

ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలోని భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ(ఐఐఎస్‌ఈఆర్) స్నాతకోత్సవం డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య అధ్యక్షతన ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఐసర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 255 మంది విద్యార్థులను పట్టాలతో సత్కరించారు.

























