
సూపర్ సిక్స్ చెప్పాం.. నిబెట్టుకున్నాం
తిరుమలకు హంద్రీ–నీవా నీరు తీసుకొస్తా
స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నేను కష్టపడి ప్రజలను సుఖపెడతాను’ అని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తిరుపతి జిల్లా రేణిగుంట, తిరుపతిలలో పర్యటించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాళహస్తి నియోజక వర్గం రేణిగుంట మండలం తూకివాకం వద్ద పూర్తి చేసిన ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను సందర్శించి ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ సహా పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వ్యర్థాలను సద్వినియోగం చేసేలా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం తిరుపతి నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర సభలో ప్రసంగించారు.
తోతాపురి విషయంలో ఇబ్బందులున్నాయి
తోతాపురి మామిడి కాయల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పట్టించుకోకపోయినా ఏపీలో గిట్టుబాటు ధర కలి్పంచామన్నారు. మామిడికి టన్నుకు రూ.12వేలు ఇచ్చేలా చేశామన్నారు. ప్రభుత్వం తరఫున రూ.4వేలు, కోనుగోలు దారులు రూ.8వేలు చెల్లించే ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. సూపర్‌సిక్స్ హామీలు అమలు చేసేశామని చెప్పుకొచ్చారు. ఇంట్లో చెత్తను ఊడ్చినట్లు నేరస్తులను ఊడ్చేయాలని పేర్కొన్నారు. గతంలో శ్రీవారే దిగొచ్చి తనకు ప్రాణభిక్ష పెట్టారని చెప్పారు. హంద్రీ–నీవా నీటిని కళ్యాణీ డ్యాంకు అక్కడి నుంచి తిరుమలకు తీసుకొస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
స్వచ్ఛాంధ్ర సాధనే లక్ష్యం
స్వచ్ఛసర్వేక్షన్‌లో ఐదు అవార్డులు సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచామని సీఎం చెప్పుకొచ్చారు. ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబరు 2 నాటికి 17 కార్పోరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని నిషేధించనున్నట్లు వెళ్లడించారు. గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. సోలార్ కరెంట్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు తిరుపతిలోని కపిలేశ్వరస్వామిని సీఎం దర్శించుకున్నారు. పారిశుధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అలిపిరి వద్ద ఉన్న శ్రీ కంచిపీఠంను సందర్శించారు.
సీఎంను కలిసేందుకు వీల్లేదంటూ పూజారికి నోటీసులు
చంద్రగిరి: సీఎం చంద్రబాబు పర్యటనలో కూటమి నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దర్పాన్ని ప్రదర్శించారని వారాహి ఆలయ ప్రధాన పూజారి శ్రీమహారుద్ర ఆది వారాహి స్వామి మండిపడ్డారు. శనివారం తిరుపతి వచి్చన సీఎంను కలిసి తిరుచానూరు సమీపంలో వారాహి ఆలయాన్ని టీడీపీ నేత అనుచరులు కూలి్చవేసిన ఘటనను వివరించేందుకు పూజారి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పూజారి ఇంటికి వెళ్లి సీఎంను కలవడానికి వీల్లేదంటూ నోటీసు జారీ చేసి హౌస్ అరెస్టు చేశారు.
చెత్త రీసైక్లింగ్‌పై సంతృప్తి
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉత్పత్తి అయ్యే చెత్తను రెడ్యూస్ రీయూస్ రీసైక్లింగ్ చేస్తున్న విధానం పట్ల సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు కట్టారు? ఎంత ఖర్చు చేశారు? అని ఆయన ఆరా తీశారు. ఇదిలా ఉంటే ఇదంతా తన పాలనలోనే జరిగినట్టు చంద్రబాబు భావిస్తున్నారని, ఈ ప్రాజెక్టులు వైఎస్సార్‌సీపీ హయాంలో నిరి్మంచినవని అధికారులు చర్చించుకోవడం కనిపించింది.
సీఎం క్లీనింగ్ అంతా సెట్టింగే..!
సాక్షి టాస్‌్కఫోర్స్: తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో సీఎం పారిశుద్ధ్య కార్యక్రమం అంతా సెట్టింగేనని తేలిపోయింది. సీఎం ఆలయానికి రాకముందే అక్కడక్కడ పూలుచల్లినట్టు కనిపించడం, వాటికి సమీపంలో భక్తులు ప్రసాదం తినిపడేసిన కప్పులు దర్శనమివ్వడం వంటి దృశ్యాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. వీటన్నింటినీ టీడీపీ నేతలే సెట్ చేసినట్లు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. వాస్తవానికి భక్తులు ప్రసాదం తినేశాక కప్పులను ఆలయంలోని దారిలోనే పడేసే అవకాశమే లేదని, అక్కడ ఏర్పాటుచేసిన డస్టుబిన్లలో వేస్తాని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఆలయంలో పడేసిన కప్పులు కొత్తవిగా ఉన్నాయని, దీనిని బట్టి ఇదంతా సీఎం పబ్లిసిటీ కోసం టీడీపీ నేతలు చేసిన సెట్టింగేనని స్పష్టమవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే సీఎం పర్యటన ఆద్యంతం పారిశుద్ధ్య కారి్మకులను టీడీపీ కార్యకర్తలుగా మార్చేశారు. వారికి కండువాలు కప్పారు. ఇదిలా ఉంటే కొందరు పంచాయతీ కార్మికుల చేత రేణిగుంట వద్ద టీడీపీ జెండాలు కట్టించారు. దీంతో కారి్మకులు ఆవేదన వ్యక్తం చేశారు.