
సాక్షి, తిరుపతి: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత పులి సంచారం కలకలం రేపింది(Leopard Spotted SV University). శుక్రవారం రాత్రి ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత సంచరించడంతో విద్యార్థులు, సిబ్బంది హడలిపోయారు. సీసీ కెమెరాలో దాని సంచారం రికార్డైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు దానిని బంధించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈ ఏడాది ఆగస్టులోనూ క్యాంపస్ పరిధిలో చిరుత సంచరించడంతో అంతా వణికిపోయారు. అయితే ఏడీ బిల్డింగ్ వెనుక ఏర్పాటు చేసిన బోనులో అది చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మరోసారి చిరుత కలకలం రేగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. విద్యార్థులు బయటకు రావద్దని హెచ్చరిక జారీ చేశారు.
ఇదీ చదవండి: మందుపాతరలతో సహజీవనం!