 
													సాక్షి, తిరుపతి: తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు.. భయంతో కేకలు వేశారు. సులభ్ కార్మికులు సమాచారంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టీటీడీ, ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు.
 
					
					
					
					
						
					          			
						
				
 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
