సాక్షి, తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం సృష్టించింది. పాపులేషన్ స్టడీస్, ఐ బ్లాక్ మధ్యలో కొత్త బిల్డింగు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశంలో చిరుత కదలికలను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. సీసీ కెమెరాలో చిరుతపులి సంచార దృశ్యాలు రికార్డు అయ్యాయి. చిరుత పులి.. కుక్కను వేటాడింది. వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు బయట ఒంటరిగా తిరగొద్దని సిబ్బంది హెచ్చరిస్తున్నారు.
కాగా, వారం రోజుల క్రితం కూడా తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు.. భయంతో కేకలు వేశారు. టీటీడీ, ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. భక్తులను గుంపులు గుంపులుగా పంపించారు.


