నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌ | YS Jagan To Visit Pulivendula For Three Days To Participate In Christmas Prayers And Praja Darbar | Sakshi
Sakshi News home page

నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌

Dec 23 2025 4:40 AM | Updated on Dec 23 2025 9:57 AM

YS Jagan to Visit Pulivendula on December 23: Andhra pradesh

మూడు రోజుల పర్యటన  

సాక్షి, అమరావతి: మా­జీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన మంగళవారం సా­యంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తా­రు.

బుధవారం ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్‌ హాల్‌లో జరిగే క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్‌ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు.  

Advertisement
 
Advertisement
Advertisement