సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో ఒకప్పుడు కొవ్వొత్తుల వెలుగుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేస్తే.. ఇప్పుడు ఆ ట్రెండ్ మారి సెల్‌ఫోన్ వెలుగుల్లో పనులు చేయాల్సిన దుస్థితి దాపురించింది. సోమవారం విశాఖ కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్ ఇందుకు వేదికైంది. జేసీ మయూర్ అశోక్ ప్రజల నుంచి వినతులు తీసుకుంటుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సిబ్బంది సెల్‌ఫోన్లలోని టార్చ్‌లైట్స్ ఆన్ చేయగా.. ఆ వెలుతురులోనే జేసీ వినతులు స్వీకరించారు. ఆ సమయంలో గ్రీవెన్స్‌లో ఈపీడీసీఎల్ ఎస్‌ఈ శ్యామ్‌బాబు ఉండటం కొసమెరుపు.
రబీలోనూ తప్పని యూరియా కష్టాలు
ఖరీఫ్‌లోనే కాదు రబీలోనూ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ అలసత్వం రైతన్నకు శాపంగా మారింది. ఆర్‌ఎస్‌కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. మరోపక్క అధికారులు యూరియా కొరత లేదని గొప్పలు చెబుతున్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడులోని ఓ ప్రైవేటు దుకాణం వద్ద సోమవారం యూరియా విక్రయిస్తున్నారన్న సమాచారంతో 500 మంది రైతులు గుమిగూడారు. గంటల తరబడి నిరీక్షించారు. తీరా ఒక్క బస్తాకూడా విక్రయించకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. – గుర్ల


