బీచ్ రోడ్డు (విశాఖ): ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు అందుబాటులో లేవు. ఈ విషయాన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరబ్ గౌర్ గుర్తించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విశాఖలోని మానసిక ఆస్పత్రి ఓపీ, స్టోర్స్, ఫార్మసీ విభాగాలను తనిఖీ చేశారు.
మానసిక ఆస్పత్రిలో సైకియాట్రిక్ రోగులకు అవసరమైన మందులు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం బీ కాంప్లెక్స్ మందులు కూడా ఉండకపోతే ఎలా అంటూ సూపరింటెండెంట్‌పై మండిపడ్డారు. మందుల కొరతపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వైద్యులు పనితీరు మెరుగుపర్చుకోవాలని.. లేదంటే కఠిన చర్యలకు వెనుకాడేది లేదని హెచ్చరించారు.


